Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్

నువ్వు బాగున్నావ్...! నీ డ్రెస్ బాగుంది...!! గుంటూరులో ర్యాగింగ్
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (09:07 IST)
ర్యాగింగ్‌పై అధికారులు తీవ్రస్థాయి చర్యలు తీసుకుంటున్నా.. ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ఏదోక చోట ర్యాగింగ్ భూతం తన ఉనికిని చాటుతూనే ఉంది. గుంటూరులో ఓ విద్యార్థినిని వెంబడించిన ఓ సీనియర్ కేసు కలకలం రేపింది. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
వెంగళరావునగర్‌కు చెందిన సాతులూరి రత్నమంజరి వర్సిటీలో ఎమ్మెస్సీ బోటనీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే వర్సిటీలో ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్‌ రెండో సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నాయుడుపాలేనికి చెందిన బాలయ్య గత శుక్రవారం రత్నమంజరిని అనుసరించాడు. తిరిగి సోమవారం ఆమెకు ఎదురుగా వచ్చి ‘రెండు రోజులుగా కనిపించలేదంటూ కామెంట్‌ చేశాడు. మంగళవారం మరోసారి ఆమెను అనుసరించి నీవు బాగున్నావ్‌, డ్రస్‌ బాగుందంటూ కామెంట్‌ చేశాడు. 
 
దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలయ్య పేరుకూడా ఆమెకు తెలియకపోవడంతో సీసీటీవీ ఫుటేజీలను చూపించగా అతడిని గుర్తించింది. గురువారం రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సెక్షన్‌ 354డి కింద కేసు నమోదు చేసి బాలయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పరిచయం పెంచుకునేందుకే బాలయ్య వెంటపడినట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu