Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సానియా మీర్జాకు మంచు లక్ష్మి, ఆశాభోంస్లే మద్దతు..!

సానియా మీర్జాకు మంచు లక్ష్మి, ఆశాభోంస్లే మద్దతు..!
, శనివారం, 26 జులై 2014 (14:09 IST)
తెలంగాణ స్టార్ సానియా మీర్జాకు మంచు లక్ష్మీ ప్రసన్న మద్దతు లభించింది. నటి, నిర్మాత మంచు లక్ష్మి సానియా మీర్జాకు తన మద్దతు ప్రకటించారు. ఈ అంశం మీద స్పందించిన మంచు లక్ష్మి సోనియా మీర్జాపై విమర్శలు చేస్తున్న వారిని తప్పుపట్టారు. దేశం తరఫున ఆడుతూ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సానియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మంచు లక్ష్మి అభిప్రాయపడ్డారు. ఇంకా టి. అంబాసిడర్‌గా సానియా ఎంపికవడం పట్ల మంచు లక్ష్మి మద్దతుతో పాటు హర్షం వ్యక్తం చేశారు.
 
మరోవైపు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను నియమించడంపై రాజకీయ వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ గాయని ఆశా భోంస్లే స్పందిస్తూ, సానియాను అనవసర వివాదంలోకి లాగరాదన్నారు. ఈ మేరకు "సానియాను అనవసర వివాదంలోకి లాగారు. నన్నూ కూడా ఓ రాజకీయ నేత ఇలాగే జాతీయ వ్యతిరేక వివాదంలోకి లాగారు. నాకు చాలా తమాషాగా అనిపించింది" అని ట్విటర్‌లో పోస్టు చేశారు. అటు నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మీ కూడా సానియాకు మద్దతు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu