Publish Date: Tue, 07 Apr 2026 (16:01 IST)
Updated Date: Tue, 07 Apr 2026 (16:04 IST)
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ఓ మహిళపై కామాంధుడు అత్యాచారం చేసాడు. అతడు, అమ్మా... కాస్త దాహంగా వుంది, మంచినీళ్లు ఇస్తారా అంటూ అడిగడంతో ఆ మహిళ మంచినీళ్లు తెచ్చేందుకు లోపలికి వెళ్లింది. అంతే... ఆమె వెనకే వెళ్లాడు ఆ కామాంధుడు. చున్నీతో ఆమె కాళ్లూ చేతులు కట్టేసి అత్యాచారం చేసాడు. తనకు హెచ్ఐవి వుందని చెప్పినా అతడు వినిపించుకోలేదు. మహిళపై అఘాయిత్యం చేసి అనంతరం ఇనుప రాడ్డుతో ఆమెపై దాడి చేసాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. చనిపోయిందని భావించిన అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన మహిళ తనపై జరిగిన దాడిని బంధువులకు తెలియజేయడంతో ఆమెను రక్షించారు. ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మూడేళ్ల చిన్నారిపై మేనమామ లైంగిక దాడి
పాట్నాలో దారుణం చోటుచేసుకుంది. డ్రగ్స్‌కు బానిస అయిన 22 ఏళ్ల యువకుడు మూడేళ్ల సొంత మేనకోడలిపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. బాలిక అరుపులు విని స్థానికులు అక్కడికి రావడంతో నిందితులు పారిపోయారు.
నిందితుడు మేనకోడలిని ఇద్దరు స్నేహితులతో కలిసి సమీప పొలాల్లోకి ఎత్తుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిద్రలోనే మేనకోడలిని పొలాల్లోకి తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనతో తీవ్ర రక్తస్రావంతో వున్న చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారీలో వున్న మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.