Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యభిచార ముఠా గుట్టురట్టు... 7 మహిళలు, 5 విటులు అరెస్టు..!

వ్యభిచార ముఠా గుట్టురట్టు... 7 మహిళలు, 5 విటులు అరెస్టు..!
, గురువారం, 5 మార్చి 2015 (19:39 IST)
హైదరాబాద్‌లో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతున్నట్టుంది. పోలీసులు గురువారం జరిపిన దాడుల్లో ఏడుగురు మహిళలతో సహా ఐదుగురు విటులు అరెస్టు అయ్యారు. నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం అందింది. 
 
దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు గురువారం అంబర్‌పేటలోని చైనాంబర్‌లో ఒక ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసిన పోలీసులు ఇద్దరు మహిళలను, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నల్లకుంటలోని బాయమ్మ వీధిలో వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను, నలుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అనంతరం విటులను అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలపై ఇండియన్ పాస్‌పోర్టు ఎంట్రీయాక్టు-1929 ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు సంఘటనలు గృహ నివాస ప్రాంతంలో జరగడంతో కలకలం రేగింది.

Share this Story:

Follow Webdunia telugu