Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20 వేల రైళ్లు.. 2.2 మిలియన్ మంది ప్రయాణం... ఒక్క తప్పు జరిగినా...

20 వేల రైళ్లు.. 2.2 మిలియన్ మంది ప్రయాణం... ఒక్క తప్పు జరిగినా...
, సోమవారం, 30 జులై 2012 (22:30 IST)
PTI
భారతీయ రైల్వే వ్యవస్థ అతిపెద్దదనీ ప్రతిరోజూ 20 వేల రైళ్లు నడుస్తున్నాయనీ, వాటిలో 22 లక్షల మందికి పైగా ప్రజలు రోజూ ప్రయాణిస్తున్నారనీ, ఈ సమయంలో ఏ ఒక్క మానవ తప్పిదం జరిగినా దాని ఫలితం తీవ్రంగా ఉంటోందని రైల్వేశాఖామంత్రి ముకుల్ రాయ్ అన్నారు. నెల్లూరు తమిళనాడు ఎక్స్ ప్రెస్ క్షతగాత్రులను పరామర్శించిన ఆయన ఎస్11 బోగీని పరిశీలించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారని అన్నారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామనీ, ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్నది ఇప్పుడే చెప్పలేమని చెప్పుకొచ్చారు.

మృతుల కటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారాన్ని ప్రకటించామన్నారు. తీవ్రంగా గాయపడ్డవారికి లక్ష రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. రైళ్ల బోగీల్లో లోపాలున్న మాట వాస్తవమేననీ, అయితే త్వరలో ఆధునీకరణ చేస్తామని అన్నారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రధాన కర్తవ్యమనీ, ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘోరమైన సంఘటనలు జరుగకుండా చూస్తామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu