Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాకుళంలో వీధికుక్కలు చిన్నారిని చీల్చేశాయి... పళ్లతో కరిచి చంపేశాయి!

శ్రీకాకుళం జిల్లాలో వీధి కుక్కల దాడిలో ఓ చిట్టితల్లి ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు విడిచేదాకా పళ్ళతో కరిచి చంపేశాయి.

శ్రీకాకుళంలో వీధికుక్కలు చిన్నారిని చీల్చేశాయి... పళ్లతో కరిచి చంపేశాయి!
, శుక్రవారం, 15 జులై 2016 (08:32 IST)
శ్రీకాకుళం జిల్లాలో వీధి కుక్కల దాడిలో ఓ చిట్టితల్లి ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు విడిచేదాకా పళ్ళతో కరిచి చంపేశాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దల్లిపేటలో గురువారం జరిగిన ఈ విషాదం వివరాలను పరిశీలిస్తే... 
 
వీధి కుక్కలు దాడిచేసిన ఘటనలో పదేళ్ల బాలిక అతి దారుణంగా మరణించింది. చుట్టుముట్టిన కుక్కలను ఎదిరించలేక, అలాగని వాటి నుంచి తప్పించుకోలేక, ఆ పసి ప్రాణం చిత్రవధ అనుభవించింది. గురువారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం 
 
దల్లిపేట గ్రామానికి చెందిన బాకి బోడిరాజు, బంగారమ్మ అనే దంపతులకు స్పందన అనే కుమార్తె ఉంది. అమ్మానాన్నలు, తాతయ్యలంతా కలిసి అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామునే కుటుంబ సభ్యులంతా పొలానికి వెళ్లారు. వారికి టీ ఇచ్చి రావడానికి ఉదయాన్నే స్పందన బయలుదేరింది. ఊరి శివార్లలోకి వచ్చేసరికి, రోడ్డుకు అడ్డంగా కుక్కలు పడుకొని ఉన్నాయి. 
 
స్పందన రోడ్డుపక్కగా, వాటిని దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో అవి మూకుమ్మడిగా బాలికని చుట్టుముట్టి దాడి చేశాయి. చేతులు ఆడిస్తూ, పెద్దగా కేకలు పెడుతుండగానే అవి ఒక్కసారిగా పైనబడ్డాయి. అంతే... స్పందన వేసుకొన్న దుస్తులను పట్టుకొని లాగి కింద పడేశాయి. స్పందన భయంతో కేకలు పెడుతుండగానే, పక్కనున్న పొలంలోకి ఈడ్చుకెళ్లాయి. 
 
పదునైన పళ్లతో శరీరాన్ని చీల్చివేశాయి. ఇంతలో అటువచ్చిన యువకులు కుక్కలను తరిమివేసి.. బాలికను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ స్పందన అప్పటికే కుక్కల దాడిలో ప్రాణాలు విడిచింది. స్పందన మృతిపై జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించింది. మొత్తం ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్‌కు రాంగ్ డైరెక్ష‌న్ ఇస్తోంది ఆయ‌నేనా?