Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో మహేష్ ఏ పార్టీకి చెందినవాడు కాదు... నాకు మద్దతు... జయదేవ్

హీరో మహేష్ ఏ పార్టీకి చెందినవాడు కాదు... నాకు మద్దతు... జయదేవ్
, శనివారం, 8 మార్చి 2014 (18:32 IST)
WD
టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఏ పార్టీకి చెందిన వాడు కాకపోయినప్పటికీ తనకు మాత్రం మద్దతిస్తాడని మహేష్ బావ గల్లా జయదేవ్ వెల్లడించారు. ప్రచారం మాత్రం చేయరని స్పష్టం చేశారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తన కుమారుడు జయదేవ్ తో సహా తెదేపా తీర్థం పుచ్చుకున్న సందర్భంలో జయదేవ్ పై వ్యాఖ్యలు చేశారు.

కాగా గల్లా జయదేవ్ స్వయాన మహేష్ అక్క భర్త కావడంతో ప్రిన్స్ ను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనిని గల్లా అరుణ కుమారితోపాటు జయదేవ్ కూడా తోసిపుచ్చారు. తాము ఎప్పటి నుంచో తమ తల్లిదండ్రులు చేసిన మంచిపనుల వల్లే రాజకీయాల్లో కొనసాగుతున్నామనీ, కనుక సినీ గ్లామర్ ను ఉపయోగించుకోబోమని స్పష్టం చేశారు. ఐతే మహేష్ బాబు మద్దతు మాత్రం తమకు తప్పకుండా ఉంటుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu