Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షికారుకు నో చెప్పిన భార్య: ఉరేసుకుని భర్త ఆత్మహత్య!

షికారుకు నో చెప్పిన భార్య: ఉరేసుకుని భర్త ఆత్మహత్య!
, సోమవారం, 10 ఫిబ్రవరి 2014 (12:24 IST)
FILE
అలా సరదాగా బయటకు వెళ్లొద్దాం.. రా అంటూ భార్యను ఓ భర్త అడిగాడు. అయితే భార్య రానని మొహం చాటేయడంతో మనస్తాపం చెందాడు. అంతేకాదు.. ఏకంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాలకెళితే.. వారిది ప్రేమ వివాహం. అన్యోన్యంగా సాగాల్సిన వారి బంధం విషాదంగా మారింది. కరీంనగర్ జిల్లాకు చెందిన వంశీకృష్ణ(26), చిత్తూరుకు చెందిన హిమబిందు ఏడాది క్రితం పెళ్లి చేసుకుని, హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ సమీపంలో ఉంటున్నారు.

శనివారం హిమబిందు పుట్టిన రోజు. సాయంత్రం సరదాగా బయటకు వెళదామని వంశీకృష్ణ కోరగా హిమబిందు రానని చెప్పేసింది. బాధతో వంశీకృష్ణ అదే రోజు రాత్రి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu