Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైభవంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

వైభవంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 56వ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అభిమానులు ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ఉదయాన్నే తెలంగాణా భవన్‌కు తెరాస నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుని, ఆయన పుష్పగుచ్చాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఏర్పాటు చేసిన 56 కిలోల భారీ కేక్‌ను కేసీఆర్ తెలంగాణ భవన్‌లో కట్ చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేల్చి తెరాస కార్యకర్తలు, నేతలు, అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు తెరాస పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. త్వరలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాలని, తమ నాయకుడికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని తెరాస నాయకులు, అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు.

Share this Story:

Follow Webdunia telugu