Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వధువు నచ్చలేదని తాళి కట్టని వరుడు... చితకబాదిన చుట్టాలు

వధువు నచ్చలేదని తాళి కట్టని వరుడు... చితకబాదిన చుట్టాలు
, గురువారం, 27 మార్చి 2014 (13:04 IST)
FILE
పెళ్లి పీటలపై వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు(అతనికిది రెండో పెళ్లి) చివరి నిమిషంలో అమ్మాయి అంటే తనకు ఇష్టం లేదని, మెడలో తాళి కట్టేది లేదని పెళ్లిపీటల పైనుంచి లేచాడు. వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఈ ఘటన జరిగింది. పెళ్లి పందిట్లో మరికొద్దిసేపట్లో వరుడు తాళి కట్టేస్తాడని అనుకుంటుండగా అతడు అలా చేశాడు. దీంతో వధువు తరపు బంధువులు పెళ్లి కొడుకు కాళ్లావేళ్లా పడ్డారు. పెళ్లి చేసుకోవాల్సిందిగా బతిమాలారు.

ఐనా అతడు మొండికేశాడు. దీంతో కోపం కట్టలు తెంచుకోవడంతో వరుడుని పట్టుకుని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పెళ్లికొడుకును అదుపులోకి తీసుకుని స్టేషనుకు తరలించారు. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన ప్రదీప్ రెడ్డి వరుడుది కాగా వధువుది వరంగల్ జిల్లా గూడురు. ఈ సంబంధాన్ని ఓ మ్యారేజీ బ్యూరో ద్వారా కుదిర్చినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu