Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొత్సకు మగతనం ఉంటే రాజీనామాలు ఆమోదించాలి!

బొత్సకు మగతనం ఉంటే రాజీనామాలు ఆమోదించాలి!
, గురువారం, 6 అక్టోబరు 2011 (10:11 IST)
FILE
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మగతనం ఉంటే మొదట పార్టీకి రాజీనామా చేసిన 29 మంది శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదించాలని వైయస్సార్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాలు విసిరారు.

జగన్‌కు మగతనం ఉంటే తన నిజాయితీ నిరూపించుకోవాలని బొత్స సవాల్ విసిరిన నేపథ్యంలో.. ముందు బొత్సకు దమ్ముంటే ఆయన పార్టీ సభ్యత్వ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. వారి రాజీనామాలు ఆమోదిస్తే ఎక్కడ ప్రభుత్వం పడిపోతుందోనన్న భయంతోనే బొత్స పార్టీ సభ్యత్వ రాజీనామాలు ఆమోదించడం లేదని ఎద్దేవా చేశారు.

రాజీనామాలు ఆమోదించే దమ్ములేకే బొత్స విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాజీనామాలు ఆమోదిస్తే మధ్యంతర ఎన్నికలు వస్తాయనే భయంతోనే కాంగ్రెసు ఆమోదానికి వెనక్కి తగ్గుతోందన్నారు. బొత్స పదవుల కోసం తాపత్రయ పడుతున్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu