Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెదిరించి అత్యాచారం చేశాడు... ఆ తర్వాత కాళ్లు పట్టుకున్నాడు...

బెదిరించి అత్యాచారం చేశాడు... ఆ తర్వాత కాళ్లు పట్టుకున్నాడు...
, బుధవారం, 8 జనవరి 2014 (21:15 IST)
FILE
పశ్చిమ గోదావరి జిల్లా కండ్రిగలో ఓ కామాంధుడైన ఖాకీ డిగ్రీ చదువుతున్న యువతికి మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ప్రేమ నటించాడు. డిగ్రీ చదువుకుంటున్న అమ్మాయికి వల వేసి వంచించాడు. వివరాలను చూస్తే... పశ్చిమ గోదావరి ఏలూరుకు చెందిన కావ్య డిగ్రీ చదువుతోంది. ఆమె కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలో రాజా అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ పరిచమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అది అమ్మాయి వరకే.

కానిస్టేబుల్ మాత్రం అమ్మాయిని మరోలా చూశాడు. ఓ రోజు తన సోదరుని ఇంటికి వెల్దాం అంటూ నమ్మించి ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. దీంతో ఆమె ప్రశ్నించింది. అక్కడ తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు. భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె రోదిస్తుండగా పెళ్లి చేసుకుంటాను కదా ఎందుకు ఏడుస్తున్నావంటూ నక్క వినయాలు పోయాడు. ఆ తర్వాత రోజులు గడిచినా పట్టించుకోవడం మానేశాడు.

మరో అమ్మాయితో ఎఫైర్ మొదలెట్టాడు. గట్టిగా నిలదీసేసరికి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దాంతో ఆమె శరీరం 80 శాతానికి పైగా గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్చారు. వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు రాజా. నిజాన్ని చెప్పవద్దనీ, అలా చెబితే తన ఉద్యోగం పోతుందనీ, అందువల్ల ప్రమాదవశాత్తూ జరిగిందని చెప్పాలనీ, అలా చెబితే పెళ్లాడతానన్నాడు. నిజమే అనుకుని అలాగే చెప్పిందా యువతి.

కేసు నమోదయిన తర్వాత మళ్లీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. దీంతో షాక్ కు గురయన బాధితురాలి తల్లిదండ్రులు అతడు చేసిన దారుణాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న రాజా పలాయనం చిత్తగించాడు. అతడి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఐతే ప్రేమ పేరుతో అమ్మాయిలను ఇలా మోసగిస్తున్న ఖాకీల పట్ల అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu