Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలకృష్ణ : చంద్రబాబు గుడివాడ పాదయాత్రపై దృష్టి!

బాలకృష్ణ : చంద్రబాబు గుడివాడ పాదయాత్రపై దృష్టి!
, సోమవారం, 4 మార్చి 2013 (22:27 IST)
FILE
తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ గుడివాడ పాదయాత్రపై దృష్టిపెట్టారు. తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్ర గుడివాడ నియోజకవర్గానికి చేరుకోనున్న నేపథ్యంలో బాలయ్య "బాబు" పాదయాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించి ఆరు నెలలు దాటిన సందర్భంగా బాబును అప్పడప్పుడు వచ్చి కలిసే బాలకృష్ణ ఈసారి గుడివాడపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గంలో ఉండటంతో పాటు 2009 ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో బాబు పాదయాత్రకు క్రేజ్ పెంచాలని బాలకృష్ణ భావిస్తున్నారు.

ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీతో పాటు ఎన్టీఆర్ తనయుడిగా పేరున్న బాలకృష్ణ పాదయాత్ర కోసం ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో బాబు పాదయాత్రపై పార్టీ కార్యకర్తలు, నేతలతో బాలయ్య మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ఒకరోజు ముందుగానే గుడివాడ చేరుకుని నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu