Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ... పెళ్లి... మోసం... మైనర్:: జామకాయ ఇస్తామని బాలికపై!

ప్రేమ... పెళ్లి... మోసం... మైనర్:: జామకాయ ఇస్తామని బాలికపై!
, శనివారం, 7 డిశెంబరు 2013 (12:04 IST)
FILE
ప్రేమపేరుతో ఓ యువకుడు మైనర్ బాలికను మోసం చేసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలంలోని దోరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటోన్న మైనర్ బాలిక(15)తో ఓ యువకుడు గత కొంతకాలంగా చనువుగా ఉంటూ మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకున్నాడు.

ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు తమ కూమార్తెను పెళ్లి చేసుకోవాల్సిందిగా మోసంచేసిన వెంకటప్పను కోరారు. అందుకు అతడు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదుచేయగా, నిందితుడిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఫర్హాద్‌హుసేన్ తెలిపారు.

మరో చోట ఓ బాలికపై ముగ్గురు యువకులు కలిసి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక తన అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ రెండోతరగతి చదువుతోంది. గురువారం పాఠశాలలకు సెలవుదినం కావడంతో బాలిక ఇంటివద్ద ఆడుకుంటోంది. ఇంటి సమీపంలో ఉన్న ముగ్గురు యువకులు జామకాయ ఇస్తామని చెప్పి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.

ఆ బాలిక కేకలు వేయడంతో ఇంట్లోనుంచి ఆ ముగ్గురు పారిపోయారు. ఇంటికి వచ్చిన తన తాతకు చిన్నారి జరిగిన విషయాన్ని ఏడుస్తూ చెప్పింది. బాలిక తాత ఫిర్యాదు మేరకు నిర్భయచట్టం కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu