Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజారాజ్యం సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

ప్రజారాజ్యం సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం
సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సభ్య నమోదు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రకటించినట్టుగా పార్టీ తొలి సభ్యత్వాన్ని వికలాంగుడైన బాలకృష్ణ నాయుడుకు అందజేశారు. రెండో సభ్యుడిగా చిరంజీవి స్వీకరించారు. ఈ సభ్యత్వ కార్యక్రమం సాయంత్రం వరకు సాగుతుంది. మాజీ ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ చేతుల మీదుగా చిరంజీవి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.

మూడో సభ్యురాలిగా తెలుగుదేశం మాజీ నేత భూమా శోభానాగిరెడ్డి స్వీకరించగా, ఆ తర్వాత హీరో పవన్ కళ్యాణ్ ఇతర పీఆర్పీ నేతలు ఒక్కొక్కరుగా సభ్యత్వం స్వీకరించారు. ఈ సభ్యత్వానికి ముందుగా.. మెగాస్టార్ చిరంజీవి జెండాను పార్టీ కార్యాలయంలో ఎగురవేశారు. అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

చిరంజీవి పతాకావిష్కరణతో ఊరూరా ప్రజారాజ్యం జెండా పండుగ ప్రారంభమైంది. ఆ తర్వాత తనపేరు మీద ఏర్పాటు చేసిన మెగాస్టార్ మెయిల్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను పీఆర్పీ అధ్యక్షుడు ప్రారంభించారు. పిమ్మట మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి ఆదర్శగ్రామం గంగదేవిపల్లికి వెళతారు. ఆ గ్రామ ప్రజలతో ముఖాముఖి సమావేశమవుతారు. వారి అనుభవాలను తెలుసుకుంటారు. గ్రామస్వరాజ్యం కోసం కలలు కంటున్న చిరంజీవి.. అది సాధన దిశగా అడుగులు వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu