Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ వచ్చే వరకు ఎన్నికల బహిష్కరణ: తెదేపా

తెలంగాణ వచ్చే వరకు ఎన్నికల బహిష్కరణ: తెదేపా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు ఈ ప్రాంతంలో జరిగే అన్ని రకాల ఎన్నికలను బహిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు సిద్ధమా అంటూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం సవాల్ విసిరింది.

దీనిపై ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే ఎల్.రమణ శుక్రవారం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఏ ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండటానికి మేం సిద్ధమని అందుకు కేసీఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరుతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ కోదండరామ్ కూడా కేసీఆర్ కబంద హస్తాల నుంచి విముక్తి పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇకపోతే.. తెరాస చీఫ్‌కు డెడ్‌లైన్లు విధించడం కొత్తేమీ కాదన్నారు. ఇప్పటి వరకు ఎన్ని డెడ్‌లైన్లు విధించారో కూడా వారికే గుర్తుండదన్నారు. తామంతా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ జెండాతోనే తెలంగాణ కోసం ఉద్యమిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

Share this Story:

Follow Webdunia telugu