Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంది: డిప్యూటీ సీఎం

తెలంగాణకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంది: డిప్యూటీ సీఎం
FILE
తెలంగాణకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉందని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ అంటే కొత్త రాష్ట్రం కాదని, ఇతరుల భూభాగం తీసుకోవట్లేదని రాజనర్సింహ తెలిపారు. 1999లో 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధినేత్రి లేఖ ఇచ్చామని రాజనర్సింహ చెప్పారు.

ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ అని, తెలంగాణను 600 సంవత్సరాలు కుతూబ్ షాహీ, ఆసిఫ్ జాహీలు పాలించారని ఆయన గుర్తు చేశారు. భూస్వాములకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది తెలంగాణ బిడ్డలేనని, తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు.. దానికంటే చిన్న రాష్ట్రాలు న్నాయని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.

అన్ని ఒప్పందాలు ఉల్లంఘన అయ్యాకే తెలంగాణ ఉద్యమం మొదలైందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు.. సమస్యలు వస్తాయంటున్నారే.. సమస్యల సృష్టికర్త ఎవరకు సీమాంధ్ర ముఖ్యమంత్రులా, తెలంగాణ మంత్రులా అంటూ ప్రశ్నించారు.

ఇతర ప్రాంత నేతలను కూడా తెలంగాణ ప్రజలు గెలిపించారు. త్యాగానికి తెలంగాణ ప్రాంత ప్రజలే ప్రతీక అన్నారు. విద్యుత్, నదీజలాల వంటి ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకుంటామని చెప్పారు.

హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, కొన్నేళ్లు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. 56 ఏళ్ల పాలనలో 46 ఏళ్లు సీమాంధ్రులే పరిపాలించారని, వచ్చే రెండేళ్లలో వెయ్యి వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటామని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతీ ఒక్కరూ తెలంగాణ వారేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇక్కడున్న వారు సెటిలర్లు కాదని, హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని స్పష్టం చేశారు.

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో దామోదర రాజనర్సింహ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆత్మగౌరవం, స్వయంపాలనకు సంబంధించినదని అన్నారు.

గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్నే తాము డిమాండ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం విశాలాంధ్రను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. నదీజలాలు, విద్యుత్ తదితర అంశాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజనర్సింహ తప్పుబట్టారు.

తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల వినియోగంలో ఉల్లంఘనలు జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ ఇన్నేళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రులు 15 ఏళ్ళపాటే పనిచేశారని, 44 ఏళ్ల పాటు పాలించిన ఇతర ప్రాంత ముఖ్యమంత్రులు ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయారని రాజనర్సింహ సూటిగా ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రాంతం నుంచి ఎంతో మంది తెలంగాణ ప్రాంతానికి వచ్చి వ్యవసాయం ఇతరత్రా పనుల్లో స్థిరపడిపోయారని, అది తెలంగాణ ప్రజల గొప్పతనంగా చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు వస్తాయంటున్నవారు.. వాటికి సృష్టికర్తలెవరో చెప్పాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu