Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టి.బిల్లు : సవరణ అంశాలివే..! జీవోఎంకు s. మంత్రులు స్పష్టం!

టి.బిల్లు : సవరణ అంశాలివే..! జీవోఎంకు s. మంత్రులు స్పష్టం!
, గురువారం, 6 ఫిబ్రవరి 2014 (10:22 IST)
FILE
రాష్ట్ర విభజన అంకం దేశ రాజధానిలో రకరకాల మలుపులు తిరుగుతూ అందరిలోనూ ఉత్కంఠ పెంచుతోంది. ‘ఇదే చివరి భేటీ. ఇక మా పని ముగిసింది’ అని మంగళవారం ప్రకటించిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం), ఆ మర్నాడే మరోసారి సమావేశమై విభజన కసరత్తును కొనసాగించింది! బుధవారం సాయంత్రం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పలు ప్రతిపాదనలతో జీవోఎం సభ్యులతో సమావేశమయ్యారు.

ఢిల్లీలోని హోం శాఖ కార్యాలయంలో దాదాపు 2 గంటలపాటు జరిగిన ప్రత్యేక భేటీలో మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్‌చంద్రదేవ్, చిరంజీవి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు రెండు నెలల క్రితమే చేసిన ప్రతిపాదనలనే జీవోఎం వారి నుంచి మరోసారి తీసుకుంది. చివరికి భేటీ అసంపూర్తిగా ముగిసింది. గురువారం మరోసారి సమావేశం కావాలని జీవోఎం నిర్ణయించింది.

‘మంత్రులు ఎనిమిది, తొమ్మిది కీలకమైన సవరణలు చేశారు. గురువారం మరోసారి జీవోఎం సమావేశం ఉంటుంది. వాటిని మరోసారి పరిశీలించాల్సి ఉంది’ అని భేటీ తర్వాత జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మీడియాకు తెలిపారు.

ముందుగా ప్రకటించిన విధంగా విభజన బిల్లు గురువారం కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందా అని ప్రశ్నించగా, ‘చూడాలి. ప్రయత్నించాలి’ అని బదులిచ్చారు. ఈ విషయమై తానేమీ చెప్పలేనని జీవోఎం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూడా భేటీ అనంతరం అభిప్రాయపడ్డారు.

ఇక సవరణాంశాలను పరిశీలిస్తే..

ముఖ్యంగా భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ నుంచి సీమాంధ్రలో కలపాలన్న డిమాండ్‌ను కచ్చితంగా అమలు చేయాలని జీవోఎంకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. ఇది బిల్లులో ఉండాల్సిందేనన్నారు

హైదరాబాద్‌పై పెట్టిన ప్రతి పైసా రాష్ట్రం మొత్తం ఆదాయంలోంచేనని, ఇప్పుడు ఆ ఆదాయాన్ని పంచడంలో ఉన్న అభ్యంతరమేమిటని పట్టుబట్టారు

మిగతా అంశాలెలా ఉన్నా భద్రాచలం, హైదరాబాద్ ఆదాయం పంపకం డిమాండ్లపై తెలంగాణ ప్రజల నుంచి కూడా ఎలాంటి అడ్డంకులూ ఉండబోవన్నారు.

‘హైదరాబాద్‌ను యూటీ చేయడం వంటి డిమాండ్లను జీవోఎం తీర్చేలా కన్పించడం లేదు. యూటీని పోలిన అధికారాలనైనా వర్తింపజేయాలని కోరాం గానీ అదీ చేసేలా లేరు. కనీసం మాకు కొత్త రాజధాని ఏర్పడేదాకానైనా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరాం గానీ దానికీ ఒప్పుకునే పరిస్థితి లేదు.

ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం సమ్మతంగానే ఉంది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశముంది. అలాగే సీమాంధ్రలో ఏర్పాటు చేయబోయే విద్యాసంస్థలన్నింటికీ ఖర్చును కేంద్రమే భరిస్తానంది’ అని సీమాంధ్ర కేంద్ర మంత్రులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu