Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టి ఎఫెక్ట్ .. సీమాంధ్ర మంత్రుల 15 మంది రాజీనామా!

టి ఎఫెక్ట్ .. సీమాంధ్ర మంత్రుల 15 మంది రాజీనామా!
, మంగళవారం, 30 జులై 2013 (16:44 IST)
File
FILE
రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 15 మంది మంత్రులు గతంలో రాజీనామా చేసిన లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేతికి సమర్పించామని, ఇపుడు కూడా ఆ లేఖకు కట్టుబడి ఉన్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం ఉంటే 15 మంది మంత్రులం రాజీనామా లేఖలపై సంతకాలు చేసి సోనియాకు గంతలోనే సమర్పించామని, ప్రస్తుతం దీనికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.

రాష్ట్రం విభజిస్తే రాజీనామాలకు సిద్ధమన్నారు. తమ ప్రాంత ప్రజల ఆలోచనలకు అనుకూలంగా తమ నిర్ణయం ఉంటుందన్నారు. తాము కేంద్రమంత్రి చిరంజీవి మాటను కాదనడం కాదని, అందరికీ అంతిమంగా అధిష్టానం ప్రజలే అన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu