Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిడిపి తరపున మహేష్ ను ప్రచారం చేయించం... గల్లా జయదేవ్

టిడిపి తరపున మహేష్ ను ప్రచారం చేయించం... గల్లా జయదేవ్
, శనివారం, 8 మార్చి 2014 (17:57 IST)
WD
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తారనే విషయంపై రాజకీయాలలో వర్గాలలో జోరుగా చర్చలు సాగుతున్న నేపధ్యంలో ఈ రోజు చంద్రబాబు సమక్షంలో గల్లా అరుణ కుమారి ఆమె కుమారుడు గల్లా జయదేవ్ టిడిపిలో చేరుతూ మహేష్ బాబును ప్రచారంకు ఉపయోగించుకోబోమని స్పష్టం చేశారు.

కాగా గల్లా జయదేవ్ స్వయాన మహేష్ అక్క భర్త కావడంతో ప్రిన్స్ ను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనిని గల్లా అరుణ కుమారితోపాటు జయదేవ్ కూడా తోసిపుచ్చారు. తాము ఎప్పటి నుంచో తమ తల్లిదండ్రులు చేసిన మంచిపనుల వల్లే రాజకీయాల్లో కొనసాగుతున్నామనీ, కనుక సినీ గ్లామర్ ను ఉపయోగించుకోబోమని స్పష్టం చేశారు. ఐతే మహేష్ బాబు మద్దతు మాత్రం తమకు తప్పకుండా ఉంటుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu