Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ తిరిగి కాంగ్రెస్‌లోకి రావచ్చు: కోమటిరెడ్డి రాజగోపాల్

జగన్ తిరిగి కాంగ్రెస్‌లోకి రావచ్చు: కోమటిరెడ్డి రాజగోపాల్
FILE
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చునని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాజకీయాలు వేరు- స్నేహం వేరని, జగన్ తమకు స్నేహితుడు కాబట్టి మాట్లాడడంలో తప్పులేదన్నారు.

రాజకీయాల్లో ఏమైనా సాధ్యమేనని, తానైనా వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్ళొచ్చని, జగనైనా కాంగ్రెస్‌లోకి రావచ్చునని రాజగోపాల్ శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే ఉద్దేశం ఈ రోజుకైతే లేదని రాజగోపాల్ అన్నారు. తాము వేరు వేరు మార్గాల్లో ప్రజాసేవ చేస్తున్నామని రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu