Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవికి పెరిగిన కొలెస్ట్రాల్: కరగదీస్తున్న వైద్యులు!

చిరంజీవికి పెరిగిన కొలెస్ట్రాల్: కరగదీస్తున్న వైద్యులు!
, గురువారం, 11 ఫిబ్రవరి 2010 (12:16 IST)
File
FILE
ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో రాజకీయ నేతగా మారిన సినీ నటుడు చిరంజీవికి కొవ్వెక్కువైంది. పనీపాట లేకపోవడంతో ఆయన మరింతగా లావెక్కిపోతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు వైద్యులు అంటున్నారు.

కొండంత ఆశలతో రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవికి నిరాశే ఎదురైంది. రాష్ట్ర విభజనకు సమ్మతిస్తామని ఆదిలో ప్రకటించిన చిరంజీవి.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. ఆ పార్టీ నేతలు ఒత్తిడి మేరకు చిరంజీవి సమైక్యాంధ్రకు మొగ్గు చూపారు. అయితే, ఇది కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.

దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇదే సమయంలో శరీరంలో కొవ్వు శాతం అమాంతం పెరిగిపోయింది. దీన్ని కరగదీసుకునేందుకు ఆయన కేరళలో మకాం వేశారు. వైద్యం కోసం ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. ఈ చికిత్స అనంతరం తిరిగి సినిమాల్లో నటించాలని చిరు భావిస్తున్నట్టు సమాచారం.

ఎందుకంటే.. రాజకీయాల్లో ఎలాగో ప్రభావం చూపలేక పోయిన చిరంజీవి... తిరిగి చిత్ర పరిశ్రమపై దృష్టి సారించారు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనే తపనతో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా... 150వ చిత్రం పూర్తి చేసేందుకు ఆయన తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రానికి ఇప్పటికే కథను సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. కడప జిల్లాకు చెందిన "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" అనే సంఘసంస్కర్త జీవితగాధ ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu