Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చలో అసెంబ్లీపై హైదరాబాద్ సీపీ అబద్ధాలు : కోదండరాం

చలో అసెంబ్లీపై హైదరాబాద్ సీపీ అబద్ధాలు : కోదండరాం
, సోమవారం, 10 జూన్ 2013 (14:40 IST)
File
FILE
చలో అసెంబ్లీ కార్యక్రమంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అబద్ధాలు చెపుతున్నారని టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఏది ఏమైనా ఈనెల 14వ తేదీన నిర్వహించతలపెట్టిన చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాల్సిందేనని ఆయన కోరారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీనే ఛలో అసెంబ్లీకి అనుమతి కోరినట్లు చెప్పారు. ఛలో అసెంబ్లీ నిర్వహణపై సీపీ అబద్దాలు ఆడుతున్నారన్నారు. పార్లమెంట్లో బిల్లు పెడితేనే ఛలో అసెంబ్లీ విరమిస్తామని చెప్పారు. లేదంటే లక్షలాదిగా తెలంగాణవాదులం తరలివచ్చి అసెంబ్లీ ముట్టడిస్తామని కోదండరామ్ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu