Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ చేతిలోకి అధికారం వస్తే దేశానికే నష్టం... ఉండవల్లి ఫైర్

కేసీఆర్ చేతిలోకి అధికారం వస్తే దేశానికే నష్టం... ఉండవల్లి ఫైర్
, బుధవారం, 10 జులై 2013 (20:25 IST)
FILE
కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తెరాస చీఫ్ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉండవల్లి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష ఉంటే, కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతిలో రాదనీ, కూర్చుని న్యాయపరమైన డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన నాయకులంతా ఒకచోట కూర్చుని మాట్లాడుకుందామని తను చెపుతుంటే తనను సన్నాసి, ఉండవల్లో బొండవల్లో అంటూ తిట్ల దండకం చదువుతున్నాడనీ, ఆయనను చూస్తుంటే చిన్నప్పుడు మా స్కూలుకు వచ్చిన ఓ పిచ్చివాడు గుర్తుకువస్తున్నాడని చలోక్తి విసిరారు.

ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశంలో చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఊపందుకుంటాయనీ, దేశానికి అది మంచిది కాదని అన్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడే కేసీఆర్ చేతికి అధికారం వస్తే రాష్ట్రానికే కాదు దేశానికే నష్టమని అన్నారు ఉండవల్లి. కేసీఆర్ తన నోటికి వచ్చినట్లు తిట్లు తిడుతూ తెలంగాణ కావాలని అంటే అది ఎంతమాత్రం సాధ్యం కాదన్నారు. ఏకాభిప్రాయం ఉంటేనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందని అన్నారు.

తెలంగాణ నుంచి వస్తున్న ఆదాయం రూ. 12, 096 కోట్లు అని కేసీఆర్ చెపుతున్న లెక్కలన్నీ పచ్చి అబద్ధాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రాజధానిలో కడుతున్న పన్నులు 20 వేల కోట్లు అయితే తెలంగాణ జిల్లాల నుంచి రూ. 2, 292 కోట్లు వస్తున్నాయనీ, సీమాంధ్ర నుంచి రూ. 12 వేల కోట్లు వస్తున్నాయన్నారు. ఈ లెక్కల్ని వక్రీకరించి కేసీఆర్ చెపుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన దూషణల ద్వారా జరుగకూడదనీ, న్యాయబద్ధంగా జరగాలని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu