Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్‌కు ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో: కోదండరామ్

కాంగ్రెస్‌కు ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో: కోదండరామ్
, శుక్రవారం, 9 డిశెంబరు 2011 (11:53 IST)
FILE
కాంగ్రెస్ ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో నినాదంతో తెలంగాణ ఉద్యమంలో ముందుకు పోతామని జేఏసీ చైర్మన్ కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, టీడీపీ నేతలు సీమాంధ్ర ప్రభుత్వానికి, సీమాంధ్ర నేతలకు ఉడిగం చేస్తున్నారని, ఉద్యమాన్ని ముందుకు పోకుండా చూస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ఆత్మగౌరవ దినం సందర్భంగా గన్‌ఫార్క్ దగ్గర తెలంగాణ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, రసమయి బాలకిషన్, ఉద్యోగ సంఘాల నేతలు దేవిశ్రీప్రసాద్, విఠల్, స్వామిగౌడ్ తదితర ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడని ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తు ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోతామన్నారు. సభలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారని కోదండరామ్ చెప్పారు. కోదండరామ్‌పై ఉద్యమించేందుకు జేఏసీ సిద్ధమని ప్రకటించారు.

తెలంగాణకు కాంగ్రెస్సే ప్రధాన శత్రువు అని కోదండరామ్ ధ్వజమెత్తారు. ఇంకా ప్రధాన ప్రతిపక్ష నేత తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. తెదేపా తెలంగాణపై తమ వైఖరిని ప్రకటించాకే స్పందిస్తానన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై చంద్రబాబు మాట్లాడకపోయినా ఇంకా టీ-టీడీపీ నేతలు చంద్రబాబే మా నాయకుడు అనడం సరికాదని కోదండరామ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఇంకా ఎదురుచూసే ఓపిక లేదని ఆయన తెలిపారు.

మరోవైపు స్వామిగౌడ్ మాట్లాడుతూ.. స్వార్థంతోనే రాజకీయ నేతలు ఉద్యమానికి సహకరించడంలేదన్నారు. అవిశ్వాసంలో భాగంగా జగన్ వైపు 17 మంది నిలబడితే, తెలంగాణ కోసం 700 మంది చనిపోయినా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పట్టింపు లేదని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం డిసెంబర్ 9 స్ఫూర్తితో ఉద్యమించాలని స్వామిగౌడ్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu