Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ కేసులో ఒత్తిళ్లు లేవు.. మా పని చేసుకుపోతున్నాం!: సీబీఐ

ఆ కేసులో ఒత్తిళ్లు లేవు.. మా పని చేసుకుపోతున్నాం!: సీబీఐ
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (18:08 IST)
FILE
ఎమ్మార్ కేసులో ఎవరి ఒత్తిళ్లు లేవని, సీబీఐ స్వతంత్రంగానే వ్యవహరిస్తూ తన పని తాను చేసుకుపోతోందని సీబీఐ అధికార ప్రతినిధి ధరణి మిశ్రా అన్నారు. ఐఏఎస్ అధికారులు సీబీఐ దర్యాప్తుపై చేస్తున్న విమర్శలపై ధరణి మిశ్రా స్పందిస్తూ.. సీబీఐ విచారణ రూల్స్ ప్రకారమే జరుగుతుందన్నారు. భయం లేకుండా నిష్పక్షపాతంగా సీబీఐ విచారణ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర కార్యాలయం ఆదేశాల ప్రకారమే సీబీఐ పని చేస్తోందన్నారు.

ఐఏఎస్ అధికారులు సీబీఐపై ఆరోపణలు చేయడం శోచనీయమని ధరణి మిశ్రా వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులు తమ విచారణపై ఆరోపణలు చేయడం సహజమేనని మిశ్రా కొట్టిపారేశారు. ఐఏఎస్‌ల ఆరోపణలు తమ విచారణపై ఎలాంటి ప్రభావం చూపవని అన్నారు. కాగా, ఎమ్మార్ కేసులో శ్రీలక్ష్మి, బిపి ఆచార్య తదితర ఐఏఎస్ అధికారులు అరెస్టును సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu