Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమెకు అమెరికా వైద్యాన్ని మేం అందిస్తాం

ఆమెకు అమెరికా వైద్యాన్ని మేం అందిస్తాం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి ఘటనలో ప్రాణాలతో బయటపడిన ప్రణీతకు సాయం అందించేందుకు అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకొచ్చింది. యాసిడ్ దాడి ఘటన తర్వాత ప్రణీత కోలుకున్నా ఆమెకు జరగాల్సిన వైద్యానికి కావల్సిన ఆర్థిక సాయం తాము చేస్తామంటూ తానా ప్రకటించింది.

ఈ సందర్భంగా తానా సభ్యులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ప్రణీత హాజరైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రణీత మాట్లాడుతూ జీవితంలో కష్టాలు సహజమని, అత్మస్థైర్యంతో ముందుకేళ్తేనే విజయం సాధించగలమని పేర్కొంది. తన ఆరోగ్య పరిరక్షణ కోసం సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన తానాకు కృతజ్ఞత తెలుపుతున్నట్టు ప్రణీత తెలిపింది.

తాను కోలుకోవడానికి ప్రారంభంనుంచి ప్రభుత్వం ఎంతో సాయపడిందని ఈ సందర్భంగా ప్రణీత గుర్తు చేసింది. అలాగే తానా సభ్యులు మాట్లాడుతూ ప్రణీతకు అమెరికాలో జరిగే వైద్య చికిత్సలకు అవసరమయ్యే ఆర్థిక సాయాన్ని తాము అందిస్తామని హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu