Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరవైలో అడుగుపెట్టిన అపర "భగీరథుడు"

అరవైలో అడుగుపెట్టిన అపర
, బుధవారం, 8 జులై 2009 (11:44 IST)
FileFILE
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నేడు అరవయ్యో యేటలోకి అడుగుపెట్టారు. ఔట్‌డోర్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకునే ఆనవాయితీ కలిగిన ముఖ్యమంత్రి.. జన్మదిన వేడుకల కోసం ఈ దఫా ప్రముఖ పర్యాటక కేంద్ర గోవాను ఎంచుకున్నారు. ఇందుకోసం ఆయన తన కుటుంబ సపరివారంతో కలిసి మంగళవారమే గోవాకు చేరుకున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పుట్టిన రోజు వేడుకలను గోవాలో జరుపుకోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. గోవాకు వెళ్లేముందు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జల సౌభాగ్యం తెచ్చిన నాడే నిజమైన పుట్టినరోజని అన్నారు. ఇదే తన అంతిమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

అయితే, ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం పట్టిపీడిస్తున్న తరుణంలో ప్రభుత్వం గుప్పించిన హామీలను నిలబెట్టుకుంటూనే మరోవైపు సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం అతిపెద్ద సవాల్. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిన ప్రస్తుత తరుణంలో సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించడం అనేది కత్తిమీద సాములాంటిందే.

అలాగే త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి పట్టుసాధించి, ఆ తర్వాత జరిగే స్థానిక, అటు పిమ్మట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను పునరావృత్తం చేయాలన్నదే వైఎస్ భవిష్యత్ విజన్‌గా ఉంది. ఇందుకోసం ఆయన ఇప్పటి నుంచి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రెండోసారి సీఎం అయ్యాక తన వైఖరిని మార్చుకుని కఠినంగా... కరుకుగా వ్యవహిస్తున్నారు.

పార్టీని బలహీన పరిచే వారిని ఉపేక్షించేది లేదని వైఎస్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వరుసగా రెండోసారి అందలమెక్కించిన ప్రజల రుణం తీర్చుకోవడంతో పాటు.. పార్టీని పటిష్టం చేసుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఆశయంగా ఉంది. ఇలా.. ఎన్నో సవాళ్ళ మధ్య 60వ యేటలోకి ప్రవేశించిన వైఎస్.. ఆశయం నెరవేరాలని కోరుకుందాం.

Share this Story:

Follow Webdunia telugu