Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నీ పచ్చి అబద్ధాలే.. కిరణ్‌కు సీఎంగా కొనసాగే అర్హత ఉందా?

అన్నీ పచ్చి అబద్ధాలే.. కిరణ్‌కు సీఎంగా కొనసాగే అర్హత ఉందా?
FILE
రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సీఎంవి పూర్తిస్థాయి అసత్యాలు, అసంబద్ధ వ్యాఖ్యలని కేసీఆర్ మండిపడ్డారు.

తెలంగాణకున్న సమస్యలన్నీ మాకు తెలుసునన్నారు. ఉద్యమాల వల్ల రాష్ట్రం ఏర్పడకపోతే ఆంధ్ర ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండి, సీమాంధ్ర ఎమ్మెల్యేలకు మద్దతుగా సంతకం చేశానని ఒప్పుకున్న ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఉందా? అంటూ ప్రశ్నించారు.

తెలంగాణలో పుట్టినవాళ్లు, తెలంగాణ బిడ్డలేనని చరిత్రను కూడా ముఖ్యమంత్రి కాలరాస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు, తెలంగాణ అంథకారమైపోతుందని కిరణ్ తెలంగాణ ప్రజలను భయపెడుతున్నారని, మాకు అద్భుతమైన బొగ్గు నిక్షేపాలున్నాయని చెప్పారు.

సమైక్య రాష్ట్రంలో పనిచెయ్యరు పనిచేయనివ్వరని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన తీరు ఇదేనా అన్నారు. తెలంగాణకు 6800 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని,
సింగరేణిలో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు.

ఇంకా తెలంగాణాకు 418 మెగావాట్ల విద్యుత్ లోటు మాత్రమే ఉందని, సింగరేణిలో 51 వాటా రాష్ట్రానిదే కావడంతో సింగరేణి ద్వారా మరో మూడు, నాలుగు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

గ్రిడ్‌ల సంగతి తనకు తెలియదా తానేమైనా పిల్లగాడ్నా అని కేసీఆర్ అన్నారు. అలాగే ఆంధ్రా మిగులు విద్యుత్ మేం కొనుక్కుంటాం, తెలంగాణకు మిగులు విద్యుత్ అమ్మరా అంటూ కేసీఆర్ అడిగారు.

ఇక నదీజలాల సంగతికి వస్తే నైలునదిని 11 దేశాలు పంచుకుంటున్నాయి, పాకిస్థాన్‌తో కలిసి ఐదు నదులు పంచుకుంటున్నాం. బ్రహ్మపుత్రను నాలుగు దేశాలతో కలిసి పంచుకుంటున్నాం. అలాంటిది రెండు రాష్ట్రాల మధ్య నీళ్లను పంచుకోలేమా అని కేసీఆర్ ప్రశ్నించారు.

28 రాష్ట్రాలకు ఏ నియమాలు వర్తిస్తాయే అవే తెలంగాణకు వర్తిస్తాయని, రాష్ట్ర విభజన ఎవరు ఆపినా ఆగదని, అది ముగిసిపోయిన అధ్యాయమని కేసీఆర్ తెలిపారు. అందుచేత అనవసరంగా రాద్దాంతం చేయొద్దన్నారు. ఉద్యోగులను హైదరాబాద్ నుంచి మేం వెళ్లమనట్లేదు.

ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. సీఎం అసమర్థత వల్లే నీళ్లు వృధా అవుతున్నాయి. శాస్త్రీయ పద్ధతి ప్రకారం ప్రాజెక్టులు లేకపోవడంతోనే నీళ్లు వృధా అవుతున్నాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu