Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్బరుద్దీన్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి : అసదుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి : అసదుద్దీన్ ఓవైసీ
, ఆదివారం, 6 జనవరి 2013 (16:56 IST)
File
FILE
ఎమ్మెల్యే అసదుద్దీన్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని, ఆయన విదేశాల నుంచి రాగానే చట్టం ముందు లొంగిపోతారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు.

రంగారెడ్డి జిల్లాలో ముస్లింల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ.. చట్టాన్ని గౌరవిస్తాం. అక్బరుద్దీన్ లొంగిపోతాడు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని కోర్టులో నిరూపిస్తామని తెలిపారు.

తాము హిందువులకు తాము వ్యతిరేకం కాదని... ముఖ్యమంత్రికి, బీజేపీకి మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. బీజేపీతో కిరణ్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాతే తమపై కేసులు పెడుతున్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu