Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఇవ్వకుంటే.. ఆసీస్ తరహాలో దాడులు

తెలంగాణ ఇవ్వకుంటే.. ఆసీస్ తరహాలో దాడులు
File
FILE
తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వని పక్షంలో ఆస్ట్రేలియా తరహాలో దాడులు చేస్తామని వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) హెచ్చరించింది. తెలంగాణాలోని పది జిల్లాల్లో నివశిస్తున్న సీమాంధ్ర ప్రజలపై ఈ దాడులు కొనసాగుతాయని వారు సంచలన ప్రకటన చేశారు. దీనిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ రాజకీయ పార్టీ నేతలు కూడా నోరు మెదపక పోవడం గమనార్హం.

ఆదివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన కాకతీయ విద్యార్థి పొలికేకలో జాక్ నేతలు ప్రసంగించారు. ఇక తెలంగాణ కోసం ప్రత్యక్ష పోరాటాలే శరణ్యమని ప్రకటించారు. మన లక్ష్యం నెరవేరని పక్షంలో సీమాంధ్ర నేతలతో పాటు.. ప్రజలపై ఆస్ట్రేలియా తరహాలో దాడులు తప్పవని హెచ్చరించారు.

మార్చి 1వ తేదీలోపు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనట్లయితే విద్యార్థుల విశ్వరూపం చూపిస్తామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో వారిని గ్రామాల్లో అడుగు పెట్టనీయమబోమన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు బలిదానం అవుతున్నా ఎమ్మెల్యేలు కనీసం పదవులకు రాజీనామా చేయకపోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏ ర్పాటుపై ఇక విజయమో.. లేక వీరస్వర్గమో తేల్చుకుంటామని ప్రకటించారు. ఇప్పటివరకు విద్యార్థులు చేసిన ఏ పోరాటాలు కూడా ఓటమిని చవిచూడలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడుతున్న లగడపాటి, కావూరి, రాయపాటి, సుబ్బరామిరెడ్డిలపై వారు తీవ్రంగా మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమం ప్రజల గుండెల్లో నుంచి పుట్టిందని, ఆంధ్రా ఉద్యమం కేవలం ఒకరిద్దరి స్వార్థశక్తులు తయారుచేసిందని వారు ఆరోపించారు. డిసెంబరు తొమ్మిదో తేదీన చేసిన ప్రకటనకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు ఉండాలని వారు హెచ్చరించారు. లేనిపక్షంలో విద్యార్థుల తఢాకా ఏమిటో చూపిస్తామని కాకతీయ విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu