Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు డైరక్షన్.. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ : వైఎస్.షర్మల

ys sharmila
, సోమవారం, 25 మార్చి 2019 (13:30 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోకి వైఎస్ షర్మిల వచ్చారు. ఆమె సోమవారం విజయవాడలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వింత రాజకీయాలు నడుస్తున్నాయంటూ ఆరోపించారు. 
 
యాక్టర్ అని, డైరెక్టర్ చెప్పినట్లే చేస్తున్నారని పవన్ - చంద్రబాబులకు చురకలు అంటించారు. ఆ పొలిటికల్ డైరెక్టర్ చంద్రబాబు అంటూ విమర్శలు చేశారామె. బయటకు పొత్తు లేదని, లోపల మాత్రం పొత్తులు కుదుర్చుకున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే అని, చంద్రబాబుకు ఓటేస్తే జనసేనకు ఓటేసినట్లు అని వివరించారు.
 
ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో కలకలలాడిన రాష్ట్రమేనా ఇదేనా? అనే అనుమానం కలుగుతుందన్నారు. వైఎస్ఆర్ పాలనలో ప్రతి మహిళకు భరోసా ఉండేదని, ఆయన ప్రతీ ఒక్కరికి ఆమోదయోగ్యమైన పాలన అందించారని, ఇలా ముందుకు పోతున్నాం.. అలా ముందుకు పోతున్నాం అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు మాత్రం రాష్ట్రాన్ని పాతికేళ్ల వెనుకకు చంద్రబాబు నెట్టారని షర్మిళ ఆరోపించారు.
 
అమరావతి భూములను లాక్కుని, 4 వేల ఎకరాలను ఉచితంగా తన బినామీలను కట్టబెట్టారని అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్‌లను చూపించడం తప్ప.. అమరావతిలో శాశ్విత భవనం కట్టారా? అని నిలదీశారు. చంద్రబాబు మాత్రం తనకోసం పర్మినెంట్ బిల్డింగ్ కట్టుకున్నారని ఆరోపించారు. పేద విద్యార్ధులకు ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ ఆగిపోయి చదువులు ఆపేశారని అన్నారు.
 
పేదవాడిని కార్పొరేట్ ఆసుపత్రికి దూరం చేసి.. గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లేలా చేయడం అన్యాయం కాదా? అని నిలదీశారు. బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు. బాబు వచ్చాక తన కొడుకుకు మాత్రమే జాబు ఇచ్చారని, కొడుకు లోకేష్‌కు మంత్రి శాఖ ఇచ్చారని అన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తికి మూడు శాఖలు ఇవ్వడం న్యాయమా? అని అన్నారు. 
 
బాబు-మోడీ జోడీతో హోదా రాకుండా పోయింది. 600 హామీలను పాతి పెట్టి.. కొత్త హామీలతో బాబు మరలా వస్తున్నారు. ముఖ్యమంత్రివి సొల్లు కబుర్లు. జగన్ పోరాటం వల్లనే హైదాపై బాబు యూ టర్న్ తీసుకున్నారు. రోజుకో మాట.. పూటకో వేషం వేసే నేత చంద్రబాబు అని షర్మిల ధ్వజమెత్తారు. జగన్ జీవితం అంతా విలువైన రాజకీయాలు చేశారు. జగనన్న అవినీతి చేసి ఉంటే కాంగ్రెస్ వీడే వాడు కాదన్నారు. ఎన్నికలు వచ్చాయి కనుక ప్రజలు ఆలోచన చెయ్యాలి. జగనన్నను సీఎం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని షర్మిల పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్వానీకి చెక్ పెట్టారు.. అమిత్ షా‌ను గాంధీనగర్ నుంచి దించారు..