విశాఖ స్టీల్ ప్లాంట్‌‌పై 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' : కేంద్రంపై షర్మిల

ఠాగూర్
మంగళవారం, 19 ఆగస్టు 2025 (09:16 IST)
విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఇది "ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్" అని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖ స్టీల్‌ను ఉద్దరిస్తామన్న మాటలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా షర్మిల కేంద్రం ప్రైవేటీకరణ కుట్రను తీవ్రంగా ఎండగట్టారు. 
 
'ఉద్ధరించడం అంతా బూటకం. ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంట్ 44 ఈవోఐలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం దారుణం. ఇది ప్లాంట్‌‍ను చంపే కుట్రలో భాగమే' అని ఆమె పేర్కొన్నారు. అలాగే, ఇటీవల ఐదు వేల మంది కార్మికుల తొలగింపు విషయంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు వేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? ఆ పనులను ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు అని ప్రశ్నించారు. పూర్వవైభవం అంటూ ఇదెక్కడి ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. 
 
చేతగానితనానికి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యపు దుర్మార్గపు చర్యకు ఇది నిదర్శనమన్నారు. ఇది కూటమి ప్రభుత్వ పడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ దర్శకత్వంలో ప్లాంట్‌ను దశలవారీగా నాశనం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోడీ దోస్తుల చేతుల్లో ఉక్కు ప్లాంట్‌ను పెట్టాలని చూస్తున్నారని, దానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని అన్నారు. 
 
ప్లాంట్లో ప్రైవేట్ కాంట్రాక్టర్లను ఆహ్వానించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. వెంటనే ఇచ్చిన 44 ఈఓఐలను వెనక్కి తీసుకోవాలని, తొలగించిన ఐదు వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వెనక్కి తీసుకునే విషయంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన కాంగ్రెస్ మరో దశ పోరాటానికి సిద్ధమవుతుందని ఆమె హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments