నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి క్రైస్తవులకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీటికి మరింత ఊతమిచ్చేలా ఆయన చర్యలు కూడా ఉంటున్నాయి. తాజాగా క్రైస్తవులు ప్రతి యేటా వెళ్లే పవిత్ర జెరూసలేం యాత్రకు చేసే ఆర్థిక సాయాన్ని మరింతగా పెంచారు.
ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లే క్రైస్తవులకు రూ.40 వేల ఆర్థిక సాయం చేస్తుండగా ఇకపై ఈ మొత్తాన్ని రూ.60 వేలకు పెంచారు. అయితే వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ ఆర్థికసాయం పొందేందుకు అర్హులు. రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉన్న క్రైస్తవులకు మాత్రం జెరూసలేం యాత్ర కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు.
దీనిపై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది హిందూ దేశమా.. లేక క్రైస్తవుల పాలనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంను ఎత్తివేసి ఆంగ్ల మీడియంలో బోధన ప్రారంభించడం వెనుక కూడా క్రిస్టియానిటీ ప్రచారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపత్యంలో జెరూసలేం యాత్రకు చేసే సాయాన్ని పెంచడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.