Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారసత్వ ఆస్తితో జల్సాలు చేస్తూ... కారుతో ఢీకొట్టి కావాలనే కారుతో తొక్కించి చంపాడు.. లావణ్య హత్య కేసు నిజాలు

వారసత్వ ఆస్తితో జల్సాలు చేస్తూ... కారుతో ఢీకొట్టి కావాలనే కారుతో తొక్కించి చంపాడు.. లావణ్య హత్య కేసు నిజాలు
, బుధవారం, 25 మే 2016 (14:39 IST)
విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ రహదారిపై పరవాడ మండలం సాలాపువానిపాలెం వద్ద రెండు రోజుల క్రితం కారు ఢీకొని మహిళ మృతిచెందిన కేసులో పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీశారు. ఈ వివరాలను ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం సమీపంలోని వడ్లపూడికి చెందిన దంపతులు మాటూరి అప్పలరాజు, లావణ్య, అతడి చెల్లెలు దివ్యలు కలిసి ఆదివారం ఉదయం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని మధ్యాహ్నం ఆలయం సమీపంలోనే భోజనం చేశారు. 
 
ఆసమయంలో అనకాపల్లి దిబ్బ వీధి రామాలయం ప్రాంతానికి చెందిన దాడి హేమకుమార్‌, అతడి స్నేహితులు నలుగురు కలిసి లావణ్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆలయానికి వచ్చి.. వారితో గొడవపడటం ఎందుకని భావించిన అప్పలరాజు భార్య, చెల్లెల్ని తీసుకుని వడ్లపూడికి తిరుగు ప్రయాణమయ్యాడు. 
 
కానీ ఆ పోకిరీ ముఠా మాత్రం వారిని వదిలిపెట్టలేదు. అప్పటికే పీకల వరకు మద్యం సేవించివున్న హేమకుమార్‌, అతడి స్నేహితులు కారులో వారిని వెంబడిస్తూ, లావణ్యను ఉద్దేశించి అసభ్యంగా దూషిస్తూ సైగలు చేయసాగారు. అంతటితో ఆగని ఆ హేమకుమార్... సాలాపువానిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని తన కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో లావణ్య కారు బాయ్‌నెట్‌పై పడగా, హేమకుమార్‌ వాహనం ఆపకుండా కొంత దూరం వెళ్లడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. అయినా అతడు కనికరం లేకుండా ఆమెను తొక్కించి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి పది గంటల సమయంలో పరవాడలోని కొండ ప్రాంతంలో నిందితులు ఉపయోగించిన కారు ఆగి ఉండడం గమనించారు. కారు టైరు పంక్చర్‌ కావడంతో నిందితులు దాని, నంబర్‌ ప్లేటు తొలగించి కారులో పడేసి పరారయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి కారును స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడు హేమకుమార్‌గా పోలీసులు భావిస్తున్నారు. దీంతో అతని కోసం ఆదివారం రాత్రి పోలీసులు ఇంటికి వెళ్లగా.. అప్పటికే కుటుంబ సభ్యులతోసహా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. వారసత్వంగా భారీగా ఆస్తి రావడంతో హేమకుమార్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ స్నేహితులను వెంటేసుకుని జల్సాగా తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హేమకుమార్‌తో పాటు అతని స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి, తిరుమలలో భానుడి భగ.. భగ... రోడ్లన్నీ నిర్మానుష్యం