రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు వైభవంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పుష్కరాలను పురస్కరించుకుని శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. శ్రీవారి తిరుమల ఆలయం తరహాలోనే ఈ ఆలయం ఉంటుందన్నారు. అంతేగాక తిరుమల ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు.
గోదావరి పుష్కరాలకు రెండు రోజుల ముందే ఆలయ పనుల్ని పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 13న ఉదయం 9.30 నిమిషాలకు శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రారంభిస్తామన్నారు. తిరుమల తరహాలోనే రోజూ పూజలు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామని ఈవో వివరించారు.