Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకయ్య ఇంట్లో చంద్రబాబుకు బ్రేక్ పడింది.. ఆధిపత్య పోరుతో..?: శివాజీ

వెంకయ్య ఇంట్లో చంద్రబాబుకు బ్రేక్ పడింది.. ఆధిపత్య పోరుతో..?: శివాజీ
, బుధవారం, 26 ఆగస్టు 2015 (18:50 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో అధికార, విపక్ష పార్టీ నేతల తీరుపై ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజీ ఏకి పారేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆధిపత్య పోరు రాష్ట్రం సర్వనాశనమైపోతోందని శివాజీ మండిపడ్డారు. చంద్రబాబు, జగన్‌లు నిర్వహించేవన్నీ పెయిడ్ ధర్నాలు, ఆందోళనలు అని, ప్రజల మనోభావాలను అనుగుణంగా పాలన సాగించాలని హితవు పలికారు. 
 
ప్రజలుగా తమకు ప్రశ్నించే హక్కు వుందని, ప్రశ్నిస్తే విమర్శిస్తారా అంటూ అడిగారు. ప్రత్యేక హోదా సాధించడంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులే కేంద్రంపై ఒత్తిడి తేవాల్సింది పోయి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీకి తర్వాత ప్రత్యేక రాదంటూ చంద్రబాబు అలా మాట్లాడివుండాల్సింది కాదని శివాజీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన చంద్రబాబుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇంట్లో బ్రేక్ పడిందని.. అందుకే స్పెషల్ స్టేటస్‌ రాదని బాబు మాట్లాడారన్నారు. 
 
చంద్రబాబు ఎలా ఉంటారో తమకు బాగా తెలుసునని.. స్పెషల్ స్టేటస్ వస్తేనే ఉద్యోగాలొస్తాయని, బాబు వస్తే జాబ్‌లు రావని శివాజీ గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం స్పెషల్ స్టేటస్ వచ్చాక సులభంగా పూర్తవుతుందన్నారు. రాజకీయ నేతలు రాజకీయాలకు అతీతంగా పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు.

తమకు ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపు అవసరం లేదని.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు-వైసీపీ అధినేత జగన్.. ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణికి పోకుండా.. ప్రత్యేక హోదాను సాధించడంపై దృష్టి సారించాలని శివాజీ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu