Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిరంజీ సైకో ఎక్కడున్నాడు...? ఎలా ఉంటాడు?... ఇదిగో ఇలా ఉంటాడట.

సిరంజీ సైకో ఎక్కడున్నాడు...? ఎలా ఉంటాడు?... ఇదిగో ఇలా ఉంటాడట.
, శనివారం, 29 ఆగస్టు 2015 (08:35 IST)
సిరంజితో మహిళలపై దాడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న సైకో విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. అతగాడిని పట్టుకోవడానికి ఇంకా ఎంత కాలం కావాలంటూ మండిపడడంతో పోలీసు ఉన్నతాధికారులే నేరుగా రంగంలోకి దిగారు. అతనిని పట్టుకోవడానికి పరుగులు పెడుతున్నారు. సిరంజిలతో గాయపరుస్తున్న సైకో ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. 
 
సైకోను పట్టుకోవడానికి 40 బృందాలని నియమించారు. దీనిపై గురువారం అడిషినల్‌ డీజీ ఆర్‌పీ ఠాగూర్‌, ఐజీపీ విశ్వజిత్‌ బాధితులతో మాట్లాడారు. బాధిత మహిళలు చెప్పిన ఆన వాళ్ళ ఆధారంగా సైకో ఊహాచిత్రాన్ని రూపొందించారు. నరసాపురం డీఎస్పీ పి.సౌమ్యలత శుక్రవారం భీమవరంలో నిందితుడి ఊహాచిత్రాన్ని మీడియాకు అందజేశారు. 
 
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళలపై దాడులు చేస్తున్న వ్యక్తి.. భీమవరం, ఉండి నియోజకవర్గల్లోని ప్రాంతాలకు చెందిన వాడై ఉంటాడని భావిస్తున్నామన్నారు. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu