ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రిత్వ శాఖకు చెందిన సర్వర్లు మొరాయించాయి. ఫలితంగా ఈ సర్వర్లతో అనుసంధానించిన పోస్ యంత్రాలు పనిచేయడం లేదు. దీంతో రేషన్ డీలర్లతో పాటు.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎండీయూల పంపిణీ సమయంలో సర్వర్ వేగంగా పనిచేస్తుందంటున్న డీలర్లు.. రేషన్ పంపిణీ సమయంలోనే సర్వర్ సమస్య ఎందుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు. సర్వర్ సమస్య ప్రతి నెల వస్తుందని డీలర్లు ఆవేదన చెందుతున్నారు.
రేషన్ కోసం జనాలు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టడం.. గంటల తరబడి సర్వర్ పనిచేయకపోవడంతో జనాలు డీలర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ మధ్యకాలంలో రేషన్ దుకాణాల్లో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయని రేషన్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు.