Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిద్రలో కాదు... నిజంగానే ఆమెను 20 సార్లు తాకాడు... మహిళా ప్రొఫెసర్ పక్కా ఆధారాలు

విజయవాడ కార్పొరేటర్ చంటి అలియాస్ ఉమ్మడి వెంకటేశ్వర రావుకు ఉచ్చు మరింత బిగుసుకునేట్లు కనబడుతోంది. ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్ పక్కా ఆధారాలు సమర్పించినట్లు పోలీసులు చెపుతున్నారు. వాటి ప్రకారం... చంటి ఆమె చేతులు, కాళ్ల పైన 20 సార్లు తాకినట్లు స

నిద్రలో కాదు... నిజంగానే ఆమెను 20 సార్లు తాకాడు... మహిళా ప్రొఫెసర్ పక్కా ఆధారాలు
, శనివారం, 14 మే 2016 (21:43 IST)
విజయవాడ కార్పొరేటర్ చంటి అలియాస్ ఉమ్మడి వెంకటేశ్వర రావుకు ఉచ్చు మరింత బిగుసుకునేట్లు కనబడుతోంది. ఆయనపై ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్ పక్కా ఆధారాలు సమర్పించినట్లు పోలీసులు చెపుతున్నారు. వాటి ప్రకారం... చంటి ఆమె చేతులు, కాళ్ల పైన 20 సార్లు తాకినట్లు సమాచారం. ఈ ఆధారాలతో చంటిని విచారించే ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే గన్నవరం వెళ్లిపోయారని పోలీసులు చెపుతున్నరు. ఐనా... ఆయనను విచారించేందుకు ప్రత్యేక బలగాలను పంపుతున్నట్లు వెల్లడించారు.
 
మరోవైపు చంటిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళలు బెజవాడలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ టు హైదరాబాద్ టు గన్నవరం ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో తన సీటు పక్కనే కూర్చున్న మహిళ పట్ల చంటి అసభ్యంగా ప్రవర్తించారంటూ శంషాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదయిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళలు ఆందోళనలు చేస్తుండటంతో చంటి స్పందించక తప్పలేదు. 
 
ఆయన మీడియాతో మాట్లాడుతూ... విమానం ఎక్కిన వెంటనే నిద్రలోకి జారుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో పొరబాటున తన కాలు ఏమయినా ఆమెకు తగిలిందేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఆమెకు క్షమాపణలు చెపుతున్నానంటూ వ్యాఖ్యానించారు. కానీ ఆయన తన పట్ల మరోలా ప్రవర్తించారంటూ సదరు ప్రయాణికురాలు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. ఆమె ఆరోపణలు నిజమని తేలితే చంటికి కనీసం 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని అనుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజవాడ కార్పొరేషన్ సొమ్ము రోడ్డు డివైడర్లపాలు... చూస్తూ ఉండాల్సిందేనా...?