ముద్రగడ పద్మనాభంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ.. ఇంటికెళ్లి మరీ.. (video)

సెల్వి
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (10:48 IST)
Mudragada_Varma
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ముద్రగడ నివాసానికి వర్మ స్వయంగా వెళ్లారు. ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.  
 
ఇకపోతే.. ఇటీవల ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడిన సంగతి తెలిసిందే. కాకినాడలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చారు.
 
ఈ నేపథ్యంలో ముద్రగడ ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకే వర్మ ఆయన ఇంటికి వెళ్లారని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఒక వాదన వినిపిస్తోంది. అయితే, ఈ కలయికకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. వర్మ వైసీపీలో చేరేందుకే పద్మనాభంతో భేటీ అయ్యారని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments