Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరుడుగట్టిన స్మగ్లర్లపై ఐదు మందిపై పిడి యాక్టు

కరుడుగట్టిన స్మగ్లర్లపై ఐదు మందిపై పిడి యాక్టు
, సోమవారం, 22 డిశెంబరు 2014 (20:32 IST)
ఎర్రదొంగలపై తిరుపతి పోలీసులు పిడికిలి బిగించారు. ఐదు మందిపై పిడి యాక్టు నమోదు చేశారు. ఇటు పోలీసులకు ఎర్ర దొంగలకు మధ్యన నిత్యం సంగ్రామమే జరుగుతోంది. అటవీశాఖ సిబ్బంది, అధికారులపై తిరగబడుతున్న ఎర్రదొంగల ఆట కట్టించడానికి పోలీసులు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశారు. అయినా సరే స్మగ్లింగున కొనసాగిస్తూ వివిద కేసులలో ముద్దాయిలుగా ఉన్నవారిని గుర్తించి జిల్లా కలెక్టర్ కు పంపారు. 
 
ఆయన అనుమతితో తిరుపతి పోలీసులు కరకంబాడీకి చెందిన చిర్ల రాజేష్ (25) ఇతనిపై 5 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉణ్నాయి. బత్తిని తిరుమల (24) తమిళనాడు చెందిన ఇతనిపై తిరువళ్ళూరులో 5 కేసులు నమొదయ్యాయి. వేలూరుకు చెందిన తంగవేలు (30)పై ఐదు కేసులు ఉన్నాయి. 
 
అలాగే తిరువళ్ళూరుకు చెందిన వెంకటేశన్ పై నాలుగు, మంగళంకు చెందిన అశోక్ కుమార్ రెడ్డి(33)పై ఆరు కేసులు ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాలు కరుడుగట్టిన స్మగ్లర్లుగా ముద్రపడిన వీరిని పోలీసులు పట్టుకుని రాజమండ్రి జైలుకు తరలించినట్లు తిరుపతి అదనపు ఎస్పీ త్రిమూర్తులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu