సంస్కృత వర్శిటీలో కీచకపర్వం... విద్యార్థిపై అత్యాచారం.. వీడియో తీసిన మరో ఆచార్యుడు

ఠాగూర్
ఆదివారం, 7 డిశెంబరు 2025 (09:42 IST)
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కీచకపర్వం చోటుచేసుకుంది. తిరుపతి పట్టణంలోని జాతీయ సంస్కృత యూనివర్శిటీలో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ వర్శిటీకి చెందిన ఇద్దరు ఆచార్యులు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక ఆచార్యుడు అత్యాచారం చేస్తుంటే మరో ఆచార్యాడు వీడియో తీశాడు. ఈ దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తంతు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు పొక్కగానే ఒక ప్రొఫెసర్‌పై వర్శిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కొంతకాలంగా మొదటి సంవత్సరం విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థినిపై ఏకాంతంగా ఉన్న దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డికి తన ఫోనులో చిత్రీకరించాడు. అనతంరం ఆ వీడియోను చూపించి బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. 
 
ఈ వేధింపులను భరించలేని బాధితురాలు 10 రోజుల క్రితం వర్శిటీ వీసీ కృష్ణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఆమె ఫిర్యాదుతో యూనివర్శిటీ అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. అలాగే, ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి, లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఈ నెల ఒకటో తేదీన వర్శిటీ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ఘటనపై పూర్తి ఆధారాలతో వర్శిటీ ఇన్‌చార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు ప్రొఫెసర్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సింక్ ల్యాబ్‌కు పంపించినట్టు సీఐ మురళీ మోహన్ తెలిపారు. ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కీచక ప్రొఫెసర్ తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం