Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ పై ఫేస్ బుక్ వార్ కు దిగిన లోకేష్

జగన్ పై ఫేస్ బుక్ వార్ కు దిగిన లోకేష్
, గురువారం, 5 మార్చి 2015 (16:11 IST)
వైఎస్ జగన్ పై నారా లోకేష్ ఫేస్ బుక్ వార్ ప్రకటించారు. నిన్నటికి నిన్న చంద్రబాబుపై జగన్ ట్విట్టర్ వార్ ను ప్రకటించి బాణాలు సందిస్తుంటే, చంద్రబాబు తనయుడు ఫేస్ బుక్ ను ప్రారంభించిన యుద్ధాన్ని ప్రకటించారు. 
 
ఫేస్ బుక్ పోస్టులతో జగన్ ను కడిగేస్తున్నారు. వరుసగా పోస్టులు చేస్తూ జగన్ ను, వైఎస్ఆర్ అభిమానులను ఉక్కిబిక్కిరి చేస్తున్నారు. భయపడేవారు జగన్ చేసిన తప్పులను మరిపోయి ఉండవచ్చు గాక, కానీ జగన్ తన రాజధాని పర్యటనలతో అక్రమంగా సంపాదించిన సొమ్మును తన సమయాన్ని వృధా చేస్తున్నారని విరుచుకు పడ్డాడు. అతనికి రాష్ట్రం, రాష్ట్ర ప్రజలపై ఏ మాత్రం బాధ్యత ఉన్నా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు-మీరు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలు పాల్గొనాలని హితవు పలికారు. 
 
కనీసం ఆయనతోపాటు అక్రమాలకు పాల్పడిన వారు స్మార్టు విలేజ్- స్మార్టు వార్డు కార్యక్రమం కింద కొన్ని గ్రామాలనైనా దత్తతు తీసుకుని తాము చేసిన పాపానికి కొంత ప్రాయశ్చిత్తం కలుగుతుందని లోకేష్ తన ఫేస్ బుక్ పోస్టులో హితవు పలికారు. 

Share this Story:

Follow Webdunia telugu