Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందపాడులో ఆగిపోయిన నాగర్ సోల్-కాకినాడ ఎక్స్ ప్రెస్

మందపాడులో ఆగిపోయిన నాగర్ సోల్-కాకినాడ ఎక్స్ ప్రెస్
, శుక్రవారం, 27 మార్చి 2015 (10:58 IST)
నాగర్సోల్-కాకినాడ ఎక్స్ ప్రెస్ మొరాయించింది. ముందుకు కదలనంటే ముందుకు కదలనని మొండికేసింది. గుంటూరు జిల్లా మందపాడు రైల్వే గేటు వద్ద నిలిచిపోయింది. పదోతరగతి విద్యార్థులు దీనివలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడు రైల్వేగేటు క్రాసింగ్‌ వద్దకు రాగానే నాగర్‌సోల్‌-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గేటు మీదనే నిలిచిపోవడంతో రోడ్డుపై నడిచే వాహనాలు కూడా ఆగిపోయాయి.
 
పదో తరగతి పరీక్షలకు వెళ్ళాల్సిన విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. సమయం మించిపోతుండడంతో దిగి దొరికిన బస్సు పట్టుకుని పరుగులు పెట్టారు. మందపాడు నుంచి పదో తరగతి పరీక్షకు హాజరుకావాల్సిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu