Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాబోయే అత్త కబురు చేసిందని వెళితే... తాళి కట్టాల్సిన వ్యక్తి గొంతు కోశాడు...

కాబోయ్ అత్త కబురు చేసిందనీ ఎంతో ఆనందంతో ఇంటికి వెళితే కాబోయే భర్త అత్యంత కిరాతతంగా గొంతు తెగ్గోసిన దారుణం విశాఖపట్టణం పూర్ణా మార్కెట్ వద్ద జరిగింది. అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింద

కాబోయే అత్త కబురు చేసిందని వెళితే... తాళి కట్టాల్సిన వ్యక్తి గొంతు కోశాడు...
, ఆదివారం, 9 జులై 2017 (08:57 IST)
కాబోయ్ అత్త కబురు చేసిందనీ ఎంతో ఆనందంతో ఇంటికి వెళితే కాబోయే భర్త అత్యంత కిరాతతంగా గొంతు తెగ్గోసిన దారుణం విశాఖపట్టణం పూర్ణా మార్కెట్ వద్ద జరిగింది. అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వైజాగ్ పూర్ణా మార్కెట్ పండావీధికి చెందిన బందరపు సతీశ్‌ డిగ్రీ మధ్యలో ఆపేసి జులాయ్‌గా తిరుగుతున్నాడు. నాలుగేళ్ల క్రితం అదే వీధిలో ఉంటున్న బుర్రాలి భవానీ (19) అనే యువతిని ప్రేమపేరుతో తనవలలో వేసుకున్నాడు. ఆమె కూడా సతీష్‌ని ఇష్టపడింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి, కులాలు వేరైనప్పటికీ పెద్దలు వారి ప్రేమను అంగీకరించేలా చేసుకున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో అరకులో జరిగిన బైక్‌ యాక్సిడెంట్‌ సతీష్ తీవ్రంగా గాయపడి, కోమాలోకి వెళ్లి ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. భవానీ ఆస్పత్రిలో రేయింబవళ్లు ఉండి సతీష్‌కు సేవలుచేసింది. అయితే, సతీష్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అనుమానంతో భవానీని వేధించడం మొదలుపెట్టాడు.
 
సతీష్‌ ప్రవర్తన తెలుసుకున్న భవానీ తల్లిదండ్రులు అతడిని వదిలేయాల్సిందిగా సూచించారు. ఆమె నిరాకరించడంతో చేసేది లేక మిన్నకుండిపోయారు. అయితే భవానీపై అనుమానం పెంచుకున్న సతీష్‌ ఆమెను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం మధ్యాహ్నం భవానీతో మాట్లాడాలని వాళ్లమ్మతో ఫోన్‌ చేయించాడు. 
 
అత్త ఫోన్ చేసిందనీ ఇంటికి వెళ్లగా అక్కడ సతీష్ ఒక్కడే ఉన్నాడు. అప్పటికే ఆమెను హత్య చేయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న సతీశ్‌... భవానీ రాగానే గొడవ పడ్డాడు. కత్తితో గొంతు కోశాడు. అద్దం పగులగొట్టి దాంతో గుచ్చాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ బయటపడే ప్రయత్నం చేయగా డంబుల్స్‌తో తలపై గట్టిగా మోది హతమార్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు... ఆ కిరాతకుడిని పట్టుకున్న దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధాని అనుకోవచ్చా?