ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు భూములిచ్చే రైతుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ ప్రకటించారు. ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించాయి.
కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి కోసం ప్రభుత్వం భూసేకర చేపట్టింది. అయితే, పోర్టుకు సమీపంలో ఉన్న ఆరు గ్రామాల రైతులు సర్కారీ భూసేకరణకు అంగీకరించేది లేదని, పోర్టు కోసం భూములివ్వబోమని తేల్చి చెపుతూ హుసేనీపాలెం వద్ద ఆందోళనకు దిగారు.
ఈ విషయం తెలుసుకున్న ఎంపీ కొనకళ్ల అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడారు. భూములిచ్చే రైతులకు నిబంధనల మేరకు పరిహారం ఇస్తామన్నారు. పరిహారం పంపిణీలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.