చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఒక యువకుడి చేతిలో యువతి అతి దారుణంగా హత్యకు గురైంది. ప్రేమికుడే ప్రియురాలిని అతి దారుణంగా పొడిచి పొడిచి చంపేశాడు. అది కూడా పెళ్ళి చేసుకున్న తరువాతనే. ఈ ఘటన జరగడానికి కారణం శోభనానికి రాలేదన్న కోపంతో చంపేసాడని చెపుతున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం తూర్పుపల్లికి చెందిన గాయత్రి, చింతమాకులపల్లికి చెందిన ఢిల్లీబాబులు రెండు సంవత్సరాలుగా ప్రేమించి ఇంట్లో పెద్దవారు ఒప్పుకోకపోవడంతో శనివారం ఇంటి నుంచి పారిపోయి పెళ్ళి చేసేసుకున్నారు.
అయితే ఇద్దరు మైనర్లు కావడంతో పోలీసులు ఇద్దరినీ విడదీసి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. పెళ్ళయి తరువాత తన భార్యేనని శోభనానికి పంపమని గొడవ గొడవ చేశాడు ఢిల్లీబాబు.
తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న గాయత్రిని శోభనానికి రమ్మని ఇంటికెళ్ళి మరీ పిలిచారు. దీంతో గాయత్రి బంధువుల అతడిని చితకబాదారు. తన బంధువుల చేత గాయత్రియే కొట్టించిందని ఆగ్రహంతో ఊగిపోయిన ఢిల్లీబాబు, ఆమె నిన్న మధ్యాహ్నం ఒంటరిగా వెళుతుండగా అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపేసి పారిపోయాడు.
తీవ్ర రక్తస్రావమైన గాయత్రిని తమిళనాడు రాష్ట్రం వేలూరులోని సిఎంసికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.