Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహమైన గంటలో వరుడు హఠాన్మరణం... పెళ్లింట విషాదం!

సందడి సందడి‌గా సాగుతున్న పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. బంధువుల రాకతో కళకళలాడిన మండపంలో పెళ్లి జరిగిన గంట సేపటికే వరుడు మృతిచెందిన దురదృష్టకర సంఘటన కడప జిల్లా రాజుపాళెం మండలం కొర్రపాడులో జరిగింది.

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (09:50 IST)
సందడి సందడి‌గా సాగుతున్న పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. బంధువుల రాకతో కళకళలాడిన మండపంలో పెళ్లి జరిగిన గంట సేపటికే వరుడు మృతిచెందిన దురదృష్టకర సంఘటన కడప జిల్లా రాజుపాళెం మండలం కొర్రపాడులో జరిగింది. ఆ వివరాలను పరిశీలిస్తే... బీసీ కాలనీకి చెందిన సూర రామచంద్రారెడ్డి (24)కి కడపలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఒక అమ్మాయితో పెళ్లి జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో పెళ్లి జరిగిన అనంతరం నూతన దంపతులు వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్లను దర్శించుకున్నారు. 
 
పెళ్లి వేడుకలను ముగించుకుని విందారగించి జీపులో స్వగ్రామమైన కొర్రపాడుకు నూతన దంపతులు చేరుకున్నారు. ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా దాహం కావడంతో తాగేందుకు నీరు కావాలని వరుడు కోరాడు. నీళ్లు తీసుకునివచ్చేలోగానే వరుడు కింద పడిపోయాడు. 
 
దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని ప్రొద్టుటూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వరుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. వరుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments