ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పటికే వేడెక్కిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ [మా] ఎన్నికలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ [మా] ఎన్నికలకు కోర్టు పచ్చజెండా ఊపింది. ఇంకా కోర్టు ఆమోదం తర్వాతే ఫలితాలు ప్రకటించాలని షరతు విధించారు.
శుక్రవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఎన్నికల బరిలో ఓ వర్గం వారు.. 'మా' ఎన్నికల తీరును సవాలు చేస్తూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విన్నది. అనంతరం ఎన్నికల నిర్వహణకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మా ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎల్లుండి ఆదివారం నాడు మా ఎన్నికలు జరుగనున్నాయి. ఓ. మురళి వేసిన పిటీషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ చేసి తీర్పు చెప్పింది. మా ఎన్నికలను నిర్వహించవచ్చుననీ, ఐతే ఎన్నికల పోలింగ్ మొత్తాన్ని వీడియో తీయాలని సూచించింది. అదేవిధంగా ఫలితాలను వెల్లడించవద్దని కూడా ఆదేశించింది. దీనితో మా ఎన్నికలు ఆదివారంనాడు షెడ్యూలు ప్రకారమే జరుగనున్నాయి.
ఇదిలావుండగా కొన్ని రోజులుగా జయసుధ, రాజేంద్రప్రసాద్ ప్యానల్స్ ఒకరికొకరు తిట్టుకుంటూ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల్లో చీప్‌గా మారారు. సెల్‌పోన్లు ఆశ చూపడం, రాజకీయనాయకుల చేత పైరవీలు చేయడం వంటి సంఘటనలు జరగాయని మురళీమోహన్ ప్యానెల్ ఆరోపణలు చేయడంతో.. ఎన్నికలు చాలా చులకనగా మారాయి.
ఇది తట్టుకోలేక వైస్‌ప్రెసిడెంట్‌గా పోటీలో వున్న నిర్మాత, నటుడు ఓ.కళ్యాణ్.. కోర్టును ఆశ్రయించాడు. ఇంతటి గొడవల మధ్య ఎన్నికలు జరగడం కరెక్ట్ కాదనీ, ఆయన కేసు వేశారు. దాంతో మురళీ మోహన్‌కూ, అలీ, ఎలక్షన్ ఆఫీసర్లను శుక్రవారమే కోర్టు హాజరు కావాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ విషయం తెలిసి... నటి జయసుధ, తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జయసుధ ఎన్నికల నుంచి తప్పుకునే అవకాశం ఉన్నదని చెప్పుకుంటున్నారు. ఐతే మొన్న మీడియా సమావేశంలో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని జయసుధ తెలిపారు. కోర్టు కూడా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపిన దరిమిలా ఎన్నికలు సజావుగా సాగిపోతాయని తెలుస్తూ ఉంది.
ఐతే రాజేంద్రప్రసాద్... తనను అధ్యక్షునిగా ఎన్నుకుంటే రూ. 5 కోట్ల కార్పస్ ఫండ్, మా కోసం ఓ అందమైన భవనాన్ని కట్టించి ఇస్తామని చెప్పడంతోపాటు అర్హులైనవారికి పింఛనులు ఇప్పిస్తానని చెప్పారు. తను చెప్పినట్లే మురళీ మోహన్ ప్యానెల్ హామీలు ఇస్తే రాజేంద్రుడితో నామినేషన్ ఉపసంహరింపజేస్తామని శివాజీరాజా చాలెంజ్ కూడా చేశారు. మొత్తమ్మీద మా ఎన్నికలు ఈసారి రచ్చరచ్చగా మారాయి.